Roaster Points for Direct Recrutments and Promotions in Telangana TSPSC DSC TRT and promotions in all Departments of Telangana Government with cycle of 100 point roaster Telangana Teachers recruitment Test will be conducted by Telangana Public Service Commission shortly and Department wise Promotion Panels will be prepared by the HODs as per the 100 Points Roaster. This Roaster may effect Teachers Recruitment Process roaster-points-for-direct-recrutments-promotions-telangana-tspsc-dsc-trt
పదోన్నతులజాబితాఎలా తయారు చేస్తారు
〰〰〰〰〰〰〰〰
*Roaster Points in Promotions Communal Roaster Points & Seniority in Promotions* *ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 5 (ఐ.ఇ.) తేది 14-2-2003 ప్రకారం పదోన్నతుల పోస్టుల యందు కూడ ప్రభుత్వములోని అన్ని శాఖలలోని, అన్ని కేటగిరి పోస్టులలో 15% ఎస్సిలకు, 6% ఎస్టిలకు రిజర్వేషన్ కల్పించబడినది. ఆ ఉత్తర్వును అమలు చేయుటకు మార్గదర్శక సూత్రాలు *GO.Ms.No. 21 Dt. 1 8.03.2003* ద్వారా విడుదలయినవి.
*అదేవిధముగ 3% వికలాంగులకు కూడ రిజర్వు చేయబడినవి.* *(GO.Ms.No.42 Dt. 19.10.2011) అంధ ఉద్యోగులకు పదోన్నతులకు అవసరమైన డిపార్ట్మెంట్ పరీక్షల నుండి 5 సంవత్సరములు మినహయింపు కలదు.* (G0.Ms.No.748 GAD Dt: 29.12.2008). *పదోన్నతులలో SC,ST & PHC కేటగిరీలో అర్హులు దొరకనట్లయితే సంభందిత రోస్టర్ పాయింట్లు 2 సంవత్సరముల వరకు బ్యాక్ లాగ్ ఉంచాలి. రెండవ సంవత్సరం కూడా భర్తీ కానట్లయితే ఆ పోస్టులకు డీ- రిజర్వు చేసి తదుపరి సంవత్సరం మరల యధావిధంగా బ్యాక్ లాగ్ గా ఉంచాలి.*
*SC , ST కేటగిరిలలో మహిళలు లేనిచో పురుషులలో భర్తీచేస్తారు.* *(G.O.Ms.No.18 Dt:17.2.2005)*
*సీనియారిటీ, ప్రమోషన్స్ రిజిస్టర్లగురించి తెలుసుకుందాం*
*DSC లోని మెరిట్ ర్యాంకు, DOB ల సహాయంతోనూ, SC, ST, PH, BC లకు కేటాయించిన రోష్టరు పక్రారం తయారు చేసిన ప్రమోషన్స్ రిజిస్టర్నే మెరిట్ కం రోష్టరు రిజిస్టర్ అంటారు.*
*గౌరవ కోర్టువారు మెరిట్ కమ్ రోస్టర్ పక్రారమే సీనియారిటీలిష్టు తయారు చేయాలని తీర్పులిస్తున్నారు. గౌరవ భారత సుప్రీం కోర్టు వారు మెరిట్కి,రోస్టర్ ర్యాంకుకు అన్యాయం జరగకుండా పదోన్నతులు ఇవ్వాలని తీర్పునిచ్చింది. APSSSR 1996 రూల్సు నందుకూడా 33 నుండి 37 వరకు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం సీనియారిటీలిష్టులు ఎలాతయారు చేయవలసిఉందో స్పష్టంగా ఉన్నది.*
*సీనియారిటీ లిష్టులు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం తయారు చేసి, దీని ఆధారంగా ప్రమోషన్సు రిజిస్టర్ తయారు చేయాలి. ఈ ప్రమోషన్సు రిజిస్టర్లో పమోషన్సులో రిజర్వేషన్లు ఉన్న SC, ST, PH అభ్యర్థులను రోష్టర్లోపెట్టి ప్రమోషన్స్ ఇవ్వాలి .*
*సీనియారిటీ రిజిస్టర్ (లిష్టు):*
*ఒకేసారి(DSC) లో సెలక్టు కాబడిన వారందరూ డేట్ ఆఫ్ జాయినింగ్ తో సంభందం లేకుండా మెరిట్ కమ్ రోస్టర్( DSC Appointment)ర్యాంకు పక్రారం సీనియారిటీలిష్టులు తయారు చేయాలి, ఈ రిజిస్టర్ పక్రారం SC, ST, PH అభ్యర్థులు లిష్టులో చివరలో ఎక్కడ ఉన్నా మెరిట్ కమ్ రోష్టరు పక్రారం ప్రమోషన్స్ పొందుతారు.*
*ప్రమోషన్స్ రిజిస్టర్:*
*ప్రమోషన్స్ లో రిజర్వేషన్లు ఉన్న SC (15%) , ST(6%), PHC (3%) లకు రోష్టరు పాయింట్లు అడక్వసీ నిబంధనలకు లోబడి వర్తిస్తాయి.*
SC :General : 7, 16, 27, 41, 52, 62, 72, 77, 91, 97 (మొత్తం : 10)
Women : 2,22,47,66,87 (మొత్తం : 5)
ST :General : 25, 33, 75, 83 (మొత్తం : 4)
Women : 8, 58 (మొత్తం : 2)
PHC :6 (అంధత్వం లేదా తక్కువ చూపు ), 31 (చెవుటిలేక మూగ ), 56 ( అంగవైకల్యం).
*Total Roaster Points : 24*
*మిగిలిన 76 పాయింట్లు అన్నీ ఓపెన్ కేటగిరీ క్రింద అందరికీ కలిపి (మెరిట్ కమ్ రోస్టర్ పక్రారం) పదోన్నతులు ఇవ్వబడతాయి ఓపెన్ కేటగిరీలో OC, BC, SC, ST, PH అభ్యర్ధులు అందరూ మెరిట్ కమ్ రోస్టర్ ర్యాంకు (DSC Appointment Rank) పక్రారం ప్రమోషన్స్ పొందుతారు, SC, ST, PH లు నిర్ణీత కోటా మేరకు పదోన్నతి పొందితేవారి కోటాలో అడక్వసీ చేరుకున్నట్లు.* *అప్పుడు వారియొక్క రోష్టరు పాయింట్లు జనరల్ గా మార్చబడుతాయి. ఇదంతా ప్రమోషన్స్ రిజిస్టర్లో ఉంటుంది*
అడక్వసీఅంటే
*"ఒక కేడర్ పోస్టులకు సంబందించి, ఆ కేడర్లో SC,ST ,PH అభ్యర్థులు తమకు కేటాయించిన పర్సంటేజి మేరకు ఇప్పటికే పనిచేస్తూ ఉంటే,ఆ కేడర్ లో అడిక్వసీ చేరుకున్నట్లు".*
*అడిక్వసీ చేరుకుంటే తదుపరి ప్రమోషన్స్ కు రిజర్వేషన్ వర్తించదు. అప్పుడు వారి పాయింట్లు అన్నీ జనరల్ క్రింద మారతాయి. అప్పుడు అందరినీ కలిపికామన్ గా మెరిట్ కమ్ రోస్టర్ (DSC Appointment Rank) ర్యాంకు పక్రారం సీనియారిటి లిస్ట్ తయారు చేసి పదోన్నతులు ఇస్తారు.*
(G.O.Ms.No. 2 dt: 9.01.2004)
(G.O.Ms.No.18 dt: 17.02.2005)
*వికలాంగ ఉద్యోగులకు పదోన్నతులలో 3% రిజర్వేషన్లు - విధివిధానాలు*
*భారత పభ్రుత్వ సూచనలు అనువర్తించుకుంటూ ఆంధప్రద్రేశ్ రాష్ట్ర పభ్రుత్వము 30 జులై1991 నుండి పభ్రుత్వ ఉత్తర్వులు సంఖ్య 115 ద్వారా అన్ని పభ్రుత్వ ఉద్యోగ నియమాకాల్లో అంగవికలురైన నిరుద్యోగులకు 3% రిజర్వేషన్లు పవ్రేశపెడుతూ 19 అక్టోబర్ 2011న పభ్రుత్వ ఉత్తర్వుల సంఖ్య 42ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల పక్రారం ఉద్యోగుల సంఖ్య 5 కన్నా ఎక్కువ ఉన్న ఇతర పభ్రుత్వ కేడర్లోను పదోన్నతులలో వికలాంగులకు రిజర్వేషన్లు ఇవ్వాలి.*
*పాయింట్లపదోన్నతి రోస్టర్లో 6,31 మరియు 56 పాయింట్లను వికలాంగులకు కేటాయించాలి.*
*ఈ రిజర్వేషన్లు, సదరు పోస్టుకు పూర్తిగా అర్హతలున్నవారికేఇవ్వాలి. విద్యార్హతలలో కానీ, శాఖాపరమైన పరీక్షల కృతార్ధతలో కాని ఎటువంటిమినహయింపు ఉండదు.*
*అంగవికలురు పనిచేయలేని కొన్ని పోస్టులకు తప్ప మిగిలిన అన్ని పోస్టులలో ఈ రిజర్వేషన్ విధానము అమలుపరచాలి. ఏ డిపార్ట్మెంట్ అయినా దానిలో కొన్ని కేడర్లకు ఈ రిజర్వేషన్లు అమలు పరచుట సాధ్యం కాకపోతేరోజుల్లో ఈ ఉత్తర్వులు ఇవ్వని శాఖనుండి మినహయింపు (Exemption) కు అనుమతి పొందాలి. పదోన్నతులలో వికలాంగుల 6, 31, 56 రోస్టర్ పాయింట్లలో అభ్యర్థులు దొరకపోతేసీనియారిటీలో అట్టడుగున ఉన్న వికలాంగ అభ్యర్థిని సదరు పాయింట్స్లో ఉంచి పదోన్నతి కల్పించాలి. సీనియారిటీజాబితాలో పైన ఉన్న అభ్యర్థి క్రింది రోస్టర్ పాయింట్ కు తీసుకురాకూడదు. అతడు/ఆమెకు అతని సీనియారిటీ ప్రాతిపదికనే పదోన్నతిగా ఇవ్వాలి.*
*ఈ పద్ధతిలో పదోన్నతులు ఇతర కేడర్లో3% వికలాంగ అభ్యర్థులు కోటా సంతృప్తిపడే వరకు కొనసాగాలి. అట్లు పూర్తయిన వెంటనే పదోన్నతులలో వికలాంగులకు రిజర్వేషన్లు సంబంధిత కేడర్లో నిలిపివేయాలి.*
*పదోన్నతులలో వివిధ రకాల రిజర్వేషన్ అమలు పరుచు విధము:*
(G.O.Ms.No.23 WCDE&DE Dt.26-5-2011) నియామకాలలో అనుసరించినట్లే వికలాంగులకు నిర్దేశించిన 3% రిజర్వేషన్లో గుడ్డివారికి 1%, చెవుడు/మూగవారికి 1%, చలనాంగాల వైకల్యత లేక మస్తిష్య పక్షవాతము ఉన్నవారికి1% చొప్పున రిజర్వేషన్లు అమలు పరచాలి. వరుసగా 3 సైకిల్స్ లో వికలాంగులలో స్త్రీలతో సహా పైమూడు రకాల అంగవైకల్యము కలవారికి పదోన్నతులలో రోస్టర్ పాయింట్లు కేటాయించాలి. ఎస్.సి, ఎస్.టి.లకు పదోన్నతులలో రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. కావున ఈ వికలాంగ రిజర్వేషన్ కొరకు పస్ర్తుతం అమలులో ఉన్న రోస్టర్ జాబితానేకొనసాగించవచ్చును. కొత్తగా రోస్టర్ జాబితాను 1వ పాయింట్తో ప్రారంభించనవసరం లేదు.
పైపాయింట్లలో 3 సైకిల్స్ పూర్తిఅయిన తరువాత మరల 4వ సైకిల్ నుండి6వ సైకిల్ వరకు ఆ పైన సైకిళ్లకు ఇదేవిధానమును కొనసాగించుకోవాలి.
ఒక ప్యానల్ లేక పదోన్నతి సంవత్సరములో ఒక వికలాంగ విభాగమునకు చెందిన అర్హుడైన అభ్యర్థిదొరకపోతే, మరుసటిసంవత్సరమునకు (Next Succeding Year) అదేవిభాగానికి, ఆ పోస్ట్ ను క్యారీఫార్వర్డ్ చేయాలి.
మరుసటి సంవత్సరం కూడా అర్హుడైన అభ్యర్థిదొరకకపోతేఈ 3విభాగాలలో మరొక విభాగమునకు గ్రుడ్డి, చెవిటి, OH వరుసలో ఉన్న అంతరమార్పు (Interchange) చేసుకోవచ్చును. స్త్రీ అభ్యర్థి దొరకకపోతే పురుష వికలాంగునకు ఇవ్వవచ్చును
పై మూడు విభాగములలో దేనిలోనూ అభ్యర్థులు దొరకకపోతేరెండవ సంవత్సరము వికలాంగత లేని అభ్యర్థిచే ఆ పోస్టును పదోన్నతి ద్వారా భర్తీచేయవచ్చును.
ఉదాహరణకు 6వ పాయింట్ వద్ద అర్హుడైన గ్రుడ్డి స్త్రీ అభ్యర్థిదొరకపోతేఆ ఖాళీని తదుపరి పదోన్నతి సంవత్సరమునకు క్వారీఫ్వార్డ్ చేయాలి. ఆ తదుపరిసంవత్సరము కూడా సదరు అభ్యర్థిదొరకకపోతేపురుష గ్రుడ్డిఅభ్యర్థికి అవ్వాలి. పురుష అభ్యర్థిదొరకపోతేచెవిటి, మూగవారికి, వారుకూడా దొరకపోతేOH అభ్యర్థిచే పదోన్నతి ద్వారా భర్తీచేయవచ్చును.
అదేవిధముగా 31వ రోస్టర్ పాయింట్లో చెవిటివారికిపదోన్నతి ఇవ్వవలసియున్నది. మొదటిసారిఆ అభ్యర్థి దొరకకపోతేతదుపరిసంవత్సరమునకు ఆఖాళీని క్యారీఫార్వర్డ్ చేయాలి. అప్పుడు కూడా అభ్యర్థిదొరకకపోతే మొదటగా OH అభ్యర్థికి అవకాశము ఇవ్వాలి. వారు కూడా దొరకకపోతేగ్రుడ్డివారికి అవకాశమివ్వాలి. ఈ ఇద్దరూ దొరకకపోతే సీనియారిటీ పక్రారం అంగవైకల్యము లేని అభ్యర్థిచేఆ పోస్టు భర్తీచేయవచ్చును.
ఇదే విధంగా 56వ రోస్టర్ పాయింట్ వద్ద OH లేక మస్తిష్క పక్షవాతము ఉన్నవారికి పదోన్నతి ఇవ్వవలసియున్ని. మొదటిసారిఆ అభ్యర్థి దొరకకపోతే తదుపరి సంవత్సరమునకు ఆ ఖాళీను క్యారీఫార్వర్డ్ చేయాలి. అప్పుడు కూడా అభ్యర్థి దొరకకపోతే మొదటగా గ్రుడ్డివారికి తరువాత చెవిటి, మూగవారికి అవకాశమివ్వాలి. వారు కూడా దొరకకపోతే సీనియారిటీ పక్రారము వైకల్యత లేని అభ్యర్థికి అవకాశమివ్వాలి.*
*Related GOs & Proc :*
*G.O.Ms.No.5 dt:14.2.2003 Reservation in Promotions.*
*G.O.Ms.No. 2 dt: 09.01.2004 Policy of Providing Rule of Reservation in Promotions in favaour of SCs & STs.*
*G.O.Ms.No. 21 dt: 18.03.2003 Policy of Providing Rules of Reservation in Promotions in favour of SCs & STs*
*G.O.Ms.No. 18 dt: 17.02.2005 In case there are no qualified women candidates available, for promotion to fill in the roster points earmarked for SC(Women) / ST (Women) the vacancies shall be filled by SC(Male) / ST (Male) candidates.*
*G.O.Ms.No.16 dt: 17.02.2005 Policy of Providing Rules of Reservation in Promotions in favour of SCs & STs - Modification Orders:*
*G.O.Ms.No. 42 dt: 19.10.2011 Providing Reservations in Promotions to the Differently Abled Employees.*
*G.O.Ms.No. 23 dt: 26.05.2011 Providing Reservation in Promotions to the Differently Abled Employees in 3 Categories.*
*G.O.Ms.No. 748 Dt: 29.12.2008 Promotion to the higher posts - Visually Handicapped employees – Passing of Departmental Tests for promotion to next higher Categories – 5 years time ...allowed....*
Roaster Points for Direct Recruitment and Promotions
ROSTER POINTS IN PROMOTIONS & APPOINTMENTS:
1 Open Competition Women2 Scheduled Castes Women
3 Open Competition
4 Backward Class (Group-A) Women
5 Open Competition
6 Visually Handicapped Women
7 Scheduled Castes
8 Scheduled Tribes Women
9 Open Competition
10 Backward Class (Group-B) Women
11 Open Competition
12 Open Competition Women
13 Open Competition
14 Backward Class (Group-C) Women In every 3rd cycle of 100 point roster
15 Open Competition
16 Scheduled Caste
17 Open Competition Women
18 Backward Class (Group-D) Womn
19 Backward Class (Group-E) Women
20 Backward Class (Group-A)
21 Open Competition
22 Scheduled Castes Women
23 Open Competition Women
24 Backward Class (Group-B)
25 Scheduled Tribe
26 Open Competition
27 Scheduled Castes
28 Open Competition
29 Backward Class (Group-A)
30 Open Competition Women
31 Hearing Handicapped (Open)
32 Open Competition
33 Scheduled Tribes
34 Open Competition Women
35 Backward Class (Group-B)
36 Open Competition
37 Open Competition
38 Open Competition Women
39 Backward Class (Group-D)
40 Open Competition
41 Scheduled Castes
42 Open Competition
43 Backward Class (Group-D
44 Backward Class (Group-E)
45 Backward Class (Group-A) Women
46 Open Competition
47 Scheduled Castes Women
48 Sports Persons Vide GO MS No 5 Dated 14.05.2018
49 Backward Class (Group-B) Women
50 Open Competition Women
51 Open Competition
52 Scheduled Castes
53 Open Competition
54 Backward Class (Group-A)
55 Open Competition Women
56 Orthopaedically Handicapped(Open)
57 Open Competition
58 Scheduled Tribes Women
59 Open Competition Women
60 Backward Class (Group-B)
61 OC
62 SC
63 OCW
64 BCD
65 OCW
66 SCW
67 OC
68 BCD
69 BCE
70 BCA
71 OCW
72 SC
73 OC
74 BCB
75 ST
76 OC
77 SC
78 OCW
79 BCA
80 OC
81 BCBW
82 OC
83 ST
84 OC
85 OC
86 OC
87 SCW
88 OC
89 BCD
90 OCW
91 SC
92 Open Competition
93 Backward Class (Group-D)
94 Backward Class (Group-E)
95 Backward Class (Group-B)
96 Open Competition Women
97 Scheduled Castes
98 Sports Persons Vide GO MS No 5 Dated 14.05.2018
99 Backward Class (Group-B) Women
100 Open competition