Tuesday, December 18, 2018

AADHAAR ఎక్కడ ఇవ్వాలి -ఎక్కడ ఇవ్వకూడదు - ఇక్కడ తెలుసుకోండి

AADHAAR ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకూడదు - ఇక్కడ తెలుసుకోండి
aadhaar-essential-not-essential-submission-conditions
సుప్రీం కోర్టు తీర్పు తరువాత కేంద్ర ప్రభుత్వం ఆధార్ విషయం లో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో దీనికి సంబంధించిన బిల్లు కు ఆమోదం తెలుపనున్నారు. ఈ బిల్లు లో ప్రస్తుతం ఆధార్ ఎక్కడెక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎక్కడ తప్పనిసరిగా ఇవ్వాలి అనే విషయాలు ఈ క్రింది విదంగా ఉన్నాయి

ఇవ్వకూడని సందర్భాలు


  1. బ్యాంక్ అకౌంట్ ప్రారంభించుటకు మరియు ప్రస్తుతం ఉన్న అకౌంట్లకు
  2. కొత్త ఫోన్/SIM కనెక్షన్ తీసుకుంటున్నప్పుడు
  3. పాఠశాల అడ్మిషన్ కోసం

తప్పనిసరిగా ఇవ్వాల్సిన సందర్భాలు


  1. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల లబ్ది కోసం
  2. ఆదాయ పన్ను సమర్పణ కోసం PAN కు Link చేయాలి
🌺అడ్మిషన్‌కు ఆధార్‌ అడగొద్దు..!🌺
🌺ఒకప్పుడు అన్నింటికీ ఆధారే ఆధారం... ఇప్పుడు క్రమంగా ఇది తగ్గిపోతోంది. బ్యాంకు ఖాతాలు తెరవడానికి, టెలికాం సేవలకు, ఇ-కామర్స్ కంపెనీలకు, మొబైల్‌ నంబరుతో అనుసంధానానికి, పిల్లలను పాఠశాలల్లో చేర్పించడానికి ఆధార్ అవసరం లేదని ఈ మధ్యే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
🌺అంతేకాకుండా ఆధార్ లేదనే కారణంతో విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి సదుపాయాలనూ నిరాకరించడానికి వీల్లేదని తెలిపింది.
🌺సీబీఎస్‌ఈ, నీట్‌, యూజీసీ పరీక్షలకు ఆధార్ అవసరం లేదని కూడా సుప్రీం చెప్పింది...
🌺ఈ నేపథ్యంలో పాఠశాలలో అడ్మిషన్‌ పొందాలంటే సదరు విద్యార్థులు ఆధార్‌ సమర్పించాల్సిన అవసరం లేదని... ఆధార్‌ గురించి స్కూల్‌ యాజమాన్యాలు సైతం అడగొద్దని యూఐడీఏఐ సూచించింది.
🌺వచ్చే విద్యా సంవత్సరానికి దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 1500 స్కూళ్లలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. నర్సరీ లేదా ప్రాథమిక విద్యకు సంబంధించిన అడ్మిషన్లు స్టార్ట్ చేశారు... ఈ నేపథ్యంలో అడ్మిషన్ల కోసం వచ్చిన చిన్నారుల ఆధార్‌ కార్డును సమర్పించాలంటూ తల్లిదండ్రులను కోరడంతో ఈ విషయం కాస్తా యూఐడీఏఐ దృష్టి వెళ్లింది. దీంతో ఆధార్ ఇవ్వాలంటూ ఒత్తిడి తేవొద్దని స్పష్టం చేసింది యూఐడీఏఐ. ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించింది.
🌺ఆధార్ అడగడం చట్ట విరుద్ధం... పాఠశాల అడ్మిషన్లతో సహా చిన్నారులకు కల్పించే ప్రతి సౌకర్యానికి ఆధార్‌ సమర్పించాలని కోరడం సరైంది కాదు.. ఆధార్ లేకపోయినా విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. బలవంతంగా ఆధార్‌ కోరితే అది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని హెచ్చరించింది యూఐడీఏఐ.