Wednesday, December 12, 2018

SBI SGSP State Government Salary Package Details

STATE GOVERNMENT SALARY PACKAGE (SGSP)
Employees of State Govt. and Union Territories and permanent employee of Corporations/Boards, etc. in States in Union Territories, Including Teachers/Professors of aided School, Colleges, Universities, etc. can avail of Salary Accounts under State Government Salary Package (SGSP) sbi-sgsp-state-government-salary-package-details-forms-download
STATE GOVERNMENT SALARY PACKAGE (SGSP)  Employees of State Govt. and Union Territories and permanent employee of Corporations/Boards, etc. in States in Union Territories, Including Teachers/Professors of aided School, Colleges, Universities, etc. can avail of Salary Accounts under State Government Salary Package (SGSP) sbi-sgsp-state-government-salary-package-details-forms-download

Package variants available as per designation of personnel



  1. SILVER: GROSS MONTHLY SALARY `5,000/- AND UP TO `20,000/-
  2. GOLD: GROSS MONTHLY SALARY `20,000 AND UP TO `50,000/-
  3. DIAMOND: CLASS 2 EMPLOYEES I.E. GAZETTED OFFICERS, ASST DIRECTORS ETC OR EMPLOYEES WITH GROSS MONTHLY SALARY `50,000 AND UP TO `1,00,000/-
  4. PLATINUM: CLASS 1 EXECUTIVE GRADE1 LIKE COMMISSIONERS, COLLECTORS, HOD, DIRECTORS, PS, SECRETARY OR EMPLOYEES WITH GROSS MONTHLY SALARY `1,00,000/-

Benefits to the Employee


  1. Hassle-free account opening process. On request, our officials will visit your premises to on-board your employees. Employees can also opt to open their accounts online or by visiting the nearest branch.
  2. A convenient way to manage salaries across a large number of centres, through the Bank's award-winning Corporate Internet Banking.
  3. Online facilities reduce paperwork and salary administration cost. Enjoy instant credit of salaries to your employees' accounts.
  4. Zero charge for salary disbursement.
  5. Equipping your employees with a power-packed Salary Account that is trusted by the largest organisations in India.

ఉద్యోగులకు ఎస్‌బీఐ తీపి కబురు.. ఖాతాల్లో చేర్చేందుకు అంగీకారం
జీతాల ఖాతాల మార్పునకు శ్రీకారం
ఎస్‌జీఎస్‌పీ ఖాతాల్లో చేర్చేందుకు అంగీకారం
చేకూరనున్న ప్రయోజనాలు..
ఉద్యోగుల్లో హర్షం

రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల ఉద్యోగులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీపికబురు అందించింది. ఎస్‌బీఐ శాఖల ద్వారా జీతాలు పొందుతున్న ఉద్యోగులందరీ ఖాతాలను స్టేట్‌ గవర్నమెంట్‌ శాలరీ ప్యాకేజీ (ఎస్‌జీఎస్‌పీగా)గా పరిగణించనుంది. ఇప్పుడు వేతనాలు పొందుతున్న ఉద్యోగులు ఈ ప్యాకేజీకి మారితే అనేక ప్రయోజనాలు పొందనున్నారు. ఈ ఖాతా మార్పునకు సంబంధించి ఎస్‌బీఐ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

దీనివల్ల ఇతర ఖాతాదారులకంటే మెరుగైన సేవలు, రాయితీలు, ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని బ్యాంకు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ అవకాశం కేవలం రెగ్యులర్‌ ఉద్యోగులకు మాత్రమే కాకుండా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యో గులకు కూడా అమలు కానుండడం విశేషం.

ప్రయోజనాలివీ

బ్యాంకు ఖాతాలో కనీస నిల్వ ఉండాలన్న నిబంధన లేదు. ఏటీఎంల నుంచి నగదు డ్రా చేసుకునే విషయంలో కూడా పరిమితులు ఉండవు. వ్యక్తిగత రుణం తీసుకున్నవారు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 నుంచి 20లక్షల వరకు బీమా వర్తిస్తుంది. రూ.20 లక్షల బీమాకు ఏడాదికి వెయ్యి రూపాయలు, రూ.10 లక్షలకు 500 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. అయితే జీతం ప్యాకేజీ ఖాతాదారులు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత, గృహ, విద్యా రుణాలు తీసుకున్నవారి నుంచి బ్యాంకు అధికారులు ప్రొససింగ్‌ ఫీజు వసూలు చేస్తారు. కానీ ఎస్‌జీఎస్‌పీ ఖాతాదారులకు రుణాలకు సంబంధించి ప్రొససింగ్‌ ఫీజులో 50 శాతం రాయితీ ఉంటుంది. అలాగే లాకరు ఛార్జీలలో కూడా 20 శాతం రాయితీ పొందవచ్చు. డాక్యుమెంటేషన్‌ లేకుండా రెండు నెలల వేతనానికి సంబంధించి ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం కూడా కల్పిస్తారు. డీడీలకు ఛార్జీలు వసూలు చేయరు.

ఈ ఖాతాలకు మారడం ఎలా?

సేవింగ్‌ అకౌంట్‌ను రెగ్యులర్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయి శాలరీ అకౌంట్‌గా మార్పుచేసుకునేందుకు ఉద్యోగి ఐడీ, పాన్‌కార్డు జెరాక్స్‌లతోపాటు రీసెంట్‌ జీతం బిల్లు, ఆధార్‌ కార్డులతో బ్యాంకు వారిచ్చిన అప్లికేషన్‌ పూర్తిచేసి సదరు ఉద్యోగి సంతకాలతో కూడిన సెట్‌ను ఎస్‌బీఐ బ్రాంచ్‌లలో సమర్పించాలి. బ్యాంకు అధికారులే రెండు, మూడు రోజుల్లో సంబంధిత ఖాతాదారుని అకౌంట్‌ ఎస్‌జీఎస్‌పీ అకౌంట్‌గా మార్పుచేస్తారు. ఆన్‌లైన్‌ అకౌంట్‌ఉన్న ఉద్యోగికి సదరు అకౌంట్‌ స్టేటస్‌ రిపోర్టు మెసేజ్‌ రూపంలో వస్తుంది. ఉద్యోగి పొందే వేతనం ఆధారంగా వివిధ పేర్లతో ఎస్‌జీఎస్‌పీ అకౌంట్‌ కేటాయిస్తారు.

5 నుంచి 20 వేల రూపాయల వరకు వేతనం తీసుకునే వారికి సిల్వర్‌ కార్డులు, 20 నుంచి 50 వేల జీతం తీసుకున్నవారికి గోల్డ్‌కార్డులు అందజేస్తారు. 50 నుంచి లక్ష రూపాయలు తీసుకునేవారికి డైమండ్‌ కార్డులు, లక్షకు పైబడి జీతం తీసుకునే వారికి ప్లాటినం కార్డులు ఇచ్చేందుకు బ్యాంకు నిర్ణయించింది. అయితే డైమెండ్‌ కార్డులు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో వాటి స్థానంలో గోల్డ్‌ కార్డులను మాత్రమే ఇస్తున్నారు. బ్యాంకింగ్‌ రంగంలో దిగ్గజమైన ఎస్‌బీఐ మాత్రమే ప్రస్తుతం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. పైసా ఖర్చు లేకుండా ఎలాంటి ఖర్చులు లేకుండా పూర్తి ఉచితంగానే ఉద్యోగులకు సేవలు అందనున్నాయి. ఉద్యోగులంతా తమ ఖాతాలను ఎస్‌జీఎస్‌పీ ఖాతాలుగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి
Click here to Change your SBI Account as SGSP Account