How to Reduce LIC Premium - Know here
LIC Policy Holders can Reduce Policy Premium by following some tips here under
మనం కష్టపడి సంపాదించే రూపాయిని క్రమశిక్షణతో ఖర్చు చేస్తే, ఇన్వెస్ట్ చేస్తే భద్రతతో పాటు భరోసా ఉంటుంది. ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీలో పెట్టుబడి ఎంతో ధీమాను ఇస్తుంది. ఎల్ఐసీ కావొచ్చు.. ఇతర ప్రయివేటు బీమా సంస్థలు కావొచ్చు.. అవి అందించే ప్రాథమిక ప్రీమియం రేట్లపై చర్చించడం సాధ్యం కాదు. కానీ పలు అంశాలను దృష్టిలో పెట్టుకొని బీమా తీసుకుంటే, మీరు చెల్లిస్తున్న ప్రీమియం ఖర్చులు తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి.
ఏడాది ప్రీమియం చెల్లింపు
ఏడాదికి ఓసారి చెల్లించే ప్రీమియంను ఎంచుకుంటే మీ ప్రీమియం ధర ఎంతోకొంత తగ్గుతుంది. మీరు ఏటా ఒక ప్రీమియంకు బదులు మల్టిపుల్ (రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు) ప్రీమియంలు చెల్లిస్తే అడిషనల్ కాస్ట్ కవర్ చేసేందుకు ఎక్స్‌ట్రా ఛార్జీలు వసూలు చేస్తాయి. ఈ అడిషనల్ ఛార్జీల కారణంగా మీ ఇన్సురెన్స్ ప్రీమియం కాస్ట్ కూడా పెరుగుతుంది.
యంగ్ ఏజ్‌లోనే ప్రారంభించాలి
వయస్సు పెరుగుతున్న కొద్దీ ప్రీమియం ప్లాన్ పెరుగుతుంది. అంటే వయస్సు పెరుగుతుంటే ప్రీమియం ఎక్కువ అవుతుంది. ఆరోగ్యపర అంశాలు కూడా ఉంటాయి. మీరు యువకుడిగా ఉన్న సమయంలో మెడికల్‌గా, ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటారు. కాబట్టి యంగ్ ఏజ్‌లో బీమా తీసుకుంటే మీ ఇన్సురెన్స్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. అప్పుడు మీ ప్రీమియం అమౌంట్ కూడా తగ్గుతుంది.
లాంగ్ టర్మ్, అదనపు ప్రయోజనాలు
లాంగ్ టర్మ్ పాలసీ తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలం అయితే తక్కువ ప్రీమియంలు చెల్లించుకుంటూ లాంగ్ టర్మ్‌లో అవసరమైన కార్పస్‌కు అవకాశం ఉంటుంది. మరో విషయం ఏమంటే, పాలసీల అదనపు ప్రయోజనాలపై అదనపు ఛార్జీలు ఉంటాయి. కాబట్టి మీకు అవసరమైన రైడర్స్ (అదనపు ప్రయోజనాలు) మాత్రమే తీసుకోవడం లాభదాయకం. అనవసరమైన వాటిని పక్కన పెట్టడం మంచిది. మరో ముఖ్యమైన అంశం.. ఆరోగ్యపరమైన అంశాలు. స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు, ఇతర అనారోగ్య కారణాలు ఇన్సురెన్స్ ప్రీమియం పెరగడానికి కారణం అవుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మీకు లాభం. అలాగే, ప్రీమియం కూడా తగ్గుతుంది.