TS Schools SMC Elections Schedule Guidelines by SSA - Download
Telangana SSA Samagra Shiksha Abhiyan issued detailed schedule on School Management Committee SMC elections and formation guidelines Important Dates released. SSA Telangana Schools SMC Election Details ts-schools-smc-elections-schedule-guidelines-ssa-telangana-download
SMC Election Important dates
Click here to Download SMC Election GuidelinesTelangana SSA Samagra Shiksha Abhiyan issued detailed schedule on School Management Committee SMC elections and formation guidelines Important Dates released. SSA Telangana Schools SMC Election Details ts-schools-smc-elections-schedule-guidelines-ssa-telangana-download
School Management Committee SMC election Schedule
SMC Election Important dates
- Issue of Notification on 22.11.2019
- Display of Parents List for conduct of Election to SMC Members 22.11.2019
- Calling objections on parents List and redressal of List 23.11.2019 and 25.11.2019
- finilising of Parents List and disply in the Board 26.11.2019
- conduct of election for SMC Mebers 30.11.2019 7am to 1pm
- Conduct of election to Chairman & Voice chairman by SMC Members 1.30pm on 30.11.2019
- First SMC Meeting on 30.11.2019 from 2pm to 4pm
Download SMC Election Guidelines Here
PPT on SMC Election
Useful Suggestions on Conducting SMC election
Download Invitation Format
Download Voter List Format to Display on 22.11.2019
Download SMC Election Minutes Format
బడిలో మ్రోగిన ఎన్నికల గంట....
- విద్యాకమిటీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
- 22న నోటిఫికేషన్
- 30న ఎన్నికల నిర్వహణ
- చేతులు ఎత్తే విధానం ద్వారా ఎన్నిక
- అవసరమైతే రహస్య బ్యాలెట్ విధానం
♦ఈనెల 30వ తేదీన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసి) ఎన్నికలు జరగనున్నాయి. 22న నోటిఫికేషన్‌ను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉదయం 10.00 గం.లకు విడుదల చేస్తారు.అదే రోజు మధ్యాహ్నం 2.00 గం.లకు ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. 25 వతేదీ సాయంత్రం4.00గం.ల వరకు ఈ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి, 26వ తేదీ ఉదయం 11.00 గంటలకు తుది జాబితా విడుదల చేస్తారు. ఎన్నికలు జరుగు ఎన్నికల ఓటర్ల జాబితాలోని తల్లిగానీ, తండ్రి గానీ లేక సంరక్షకులుగానీ ఒకరే ఓటుకు అర్హులు. *ఓటర్లలో 50 శాతం హాజరు కాకపోతే కోరం లేనట్లే*. ముందుగా సభ్యులను చేతులెత్తే పద్ధతిన లేక మూజువాణి ఓటుతో, తప్పనిసరి పరిస్థితుల్లో రహస్య బ్యాలెట్ ఓటింగ్ పద్ధతిన నిర్వహిస్తారు.
*♦ఎన్నిక ఇలా..
సభ్యులను 30వ తేదీన ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఎన్నుకుంటారు.1.30 గంటలకు నూతన సభ్యుల ఏర్పాటు చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ల ఎన్నికల అనంతరం వారి ప్రమాణ స్వీకారం, వెంటనే ప్రథమ ఎస్‌ఎంసి సమావేశం మధ్యాహ్నం 2.00 గంటల నుండి 4.00 వరకు నిర్వహిస్తారు.
*♦సభ్యుల ఎన్నికల ఇలా...*
ప్రతి తరగతికీ ముగ్గురు సభ్యులను ఎన్నుకుంటారు. వీరిలో ఇద్దరు మహిళలుంటారు. ఇందులో ఒకరు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వారి పిల్లల, అనాథ, ఎస్సీ, ఎస్టీ, వలసల, వీధిబాలల, ప్రత్యేక అవసరాల పిల్లల, హెచ్‌ఐవి బారినపడ్డ పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరిని ఎన్నుకోవాలి. మరొకరు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు (బిసి,మైనార్టీ, వార్హికాదాయం రూ.60 వేలు మించని ఒసి తల్లిదండ్రుల పిల్లల) తల్లిదండ్రులను ఒకరిని ఎన్నుకోవాలి. మూడో వ్యక్తిని ఎవర్ని అయినా ఎన్నుకోవచ్చు. ప్రాథమిక పాఠశాలల్లో 5 తరగతులుంటే తరగతికి ముగ్గురు చొప్పున 15 మందిని, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 7వ తరగతి వరకు ఉంటే 21మందిని, 8వ తరగతి వరకు ఉంటే 24 మంది సభ్యులను, హైస్కూళ్ళలో 6, 7, 8 తరగతుల తల్లిదండ్రుల్లో 9 మందిని సభ్యలుగా ఎన్నుకోవాలి.
ప్రధానోపాధ్యాయులే కన్వీనర్
ఎస్‌ఎంసిలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులే కన్వీనర్‌గా ఉంటారు. మరో సీనియర్ ఉపాధ్యాయులు, వార్డు మెంబరు/కౌన్సిలర్, ఎఎన్‌ఎం, మహిళా సమాఖ్య అధ్యక్షులు, అంగన్‌వాడీ కార్యకర్త ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఎన్నికైన సభ్యులతోపాటు ఈ ఆరుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులు, ఇద్దరు కో-ఆప్షన్ సభ్యలుంటారు. ప్రాథమిక పాఠశాలల్లో ఎన్నికైన 15 మందితోపాటు ఆరుగురు ఎక్స్ ఆఫీషియో సభ్యులు, ఇద్దరు కో-ఆప్షన్ సభ్యలతో మొత్తం 23 మంది ఉంటారు. 7వ తరగతి వరకున్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో 29 మంది, 8వ తరగతి వరకు ఉంటే 32 మంది, హైస్కూళ్లలో మొత్తం 17 మంది సభ్యులు ఉంటారు. ఆయా పాఠశాలల పరిధిలో విద్యావేత్త, పాఠశాల అభివృద్ధికి సహకరించే దాతలను ఎస్‌ఎంసి సభ్యులుగా కో-ఆప్ట్ చేసుకోవచ్చు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి లేదా విద్యార్థుల్లో ఇద్దర్ని కో-ఆప్ట్ చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీ సర్పంచి, మున్సిపల్ ఛైౖర్మన్ సమావేశాలకు హాజరు కావచ్చు.👇👇