112 App Govt of India Emergency Responsive Support System - Install
The 112 SOS Mobile App is a part of the Emergency Response Support System (ERSS), a Govt of India initiative. The application is functional in most of the states in India. Visit https://112.gov.in/statesCurrently launched in Andaman and Nicobar Islands, Andhra Pradesh, Chandigarh, Dadra and Nagar Haveli, Daman and Diu, Delhi, Goa, Gujarat, Himachal Pradesh, Jammu & Kashmir, Karnataka, Kerala, Madhya Pradesh, Maharashtra, Mizoram, Nagland, Puducherry, Punjab, Rajasthan, Tamil Nadu, Telangana, Uttar Pradesh and Uttarakhand only.govt-of-india-emergency-responsive-support-system-android-app-download-for-assistance
In an emergency situation, a person in distress may seek for the assistance of local emergency service delivery departments and volunteers through the App. The App will send emergency alerts with the user's details(name, age, emergency contacts) and location information, along with a generated call to ‘112’ - to the State Emergency Control Room and the person’s emergency contacts. The system forwards the emergency alert to nearby online local volunteers if available. The emergency alert is notified with an audible sound/ visual alert on the volunteer smartphones. The volunteers can mark their consent to help and the volunteer details along with photo and contact number will be forwarded to the person in distress.
Highlights of 112 Govt of India Official App
- Providing single panic app across the country for addressing citizen emergency.
- Providing 24 x 7, efficient and effective response system, which can involve local volunteers from citizens to provide efficient emergency response service
- Timely dispatch of field resources (police, health, fire & disaster management) to the location of incidence using the system.
- Integration with existing emergency response systems.
- It aims to make the operations citizen-friendly, more transparent, and efficient and provides citizen profile management and feedback mechanisms.
- It will also help to keep track of the progress of incidents and the services delivered taking emergency services to the next level.
112 ఇండియా’ గురించి తెలుసా?
*🌀మొన్న ‘నిర్భయ’.. నిన్న ‘దిశ’.. రేపు ఏమవుతుందోనని మహిళా లోకం బిక్కుబిక్కుమంటోంది. ఎప్పుడు, ఎటువైపు నుంచి అపరిచిత వ్యక్తులు దాడి చేస్తారోనని భయపడుతోంది. ఏదైనా అపాయం జరిగే సూచనలు కనిపించినప్పుడు పోలీసుల నెంబరు అందుబాటులో ఉన్నా... ఆ సమయంలో మాట్లాడలేని పరిస్థితి. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఓ యాప్‌ను తయారు చేసింది. అదే ‘112 ఇండియా’. ఈ యాప్‌ను ఈ ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా (పశ్చిమ్ బెంగాల్) మినహా అందుబాటులో ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘112 ఇండియా’ యాప్‌లో వున్న సౌకర్యాలు*
మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు, వారు ఇబ్బందుల్లో ఉంటే వెంటనే స్పందించేందుకు ఈ ఏడాది జనవరి 19న కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏకీకృత ‘112’ ఫోన్ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దాంతోపాటు 112 ఇండియా మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. అమెరికాలో 911 ఎలాగో భారత్‌లో 112 అదే విధంగా ఎమర్జెన్సీ సేవలను అందిస్తుంది.
112 ఇండియా’ యాప్
ఎవరైనా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని కష్ట సమయంలో అందులోని బటన్‌ను ప్రెస్ చేస్తే ఎమర్జెన్సీ సర్వీసులకు సమాచారం అందుతుంది. ఎలాంటి వాయిస్ కాల్ లేకుండానే సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని బాధితురాలి చెంతకు పోలీసులు చేరుకుంటారు. అందులోని ప్రత్యేక సదుపాయాన్ని షౌట్(shout) అని అంటారు. దీనికి మీరు చేయాల్సిందల్లా... యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని మొబైల్ నెంబరు, ఓటీపీతో లాగిన్ అవ్వడమే.
ఇలా వాడాలి..
యాప్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వగానే... జీపీఎస్ సాయంతో మొబైల్ స్క్రీన్ పై మీరున్న ప్రాంతం కనిపిస్తుంది. స్క్రీన్ దిగువన నాలుగు అంశాల బ్లాక్ ఉంటుంది. అందులో పోలీస్, ఫైర్, మెడికల్, అదర్స్ అని నాలుగు ఆప్షన్లు ఉంటాయి. మీకు కావాల్సిన ఐకాన్‌ను క్లిక్ చేస్తే... సమాచారం పంపాలా? అని పాప్‌అప్ విండో వస్తుంది. దాన్ని ‘ఓకే’ చేస్తే మీరున్న ప్రాంతం, మీ మొబైల్ నెంబరు తదితర వివరాలు పోలీసులు/సంబంధిత విభాగాలకు చేరిపోతాయి. వాటి ఆధారంగా భద్రతా సిబ్బంది బాధితుల దగ్గర చేరుకొని సాయం చేస్తారు.
గూగుల్ ఈఎల్‌ఎస్..
112 ఇండియా యాప్ గూగుల్ ఈఎల్‌ఎస్ సాంకేతికత ఆధారంగా పని చేస్తుంది. ఈఎల్ఎస్ అంటే ఎమర్జెన్సీ లోకేషన్ సర్వీస్. గూగుల్ ఈఎల్‌ఎస్ ద్వారా మన లోకేషన్ వెంటనే ఎమర్జెన్సీ సర్వీసులకు చేరిపోతుంది. గూగుల్ ఈఎల్ఎస్ అక్షాంశం, రేఖాంశాల సాయంతో లోకేషన్‌కు కేవలం 5 నుంచి 50 మీటర్ల వరకు వ్యత్యాసంతో సంకేతాలు అందుతాయి. దీంతో స్పందించి ఘటనాస్థలానికి వెంటనే చేరుకోవచ్చు. ఫీచర్ ఫోన్లు (సాధారణ ఫోన్ల’లోనూ 112 సేవలు పొందవచ్చు. దీని కోసం ఆ నంబర్‌ను అందుబాటులో ఉంచాలని ఫోన్ల తయారీదారులకు ప్రభుత్వం సూచించింది. వరుసగా మూడు సార్లు పవర్ బటన్‌ను నొక్కినా, 5 లేదా 9 నంబర్‌ను లాంగ్ ప్రెస్ చేసినా 112కు కాల్ వెళ్లేలా సాధారణ ఫోన్లను తయారు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని మొబైళ్లలో ఈ సదుపాయం ఉంది.
స్వచ్ఛందంగా కూడా...
ఈ యాప్‌లో మీరు కూడా స్వచ్ఛందంగా సేవలు అందించవచ్చు. అంటే ఎవరైనా బాధితులు ఈ యాప్ ద్వారా సాయం కోరితే దగ్గరలోని వలంటీర్లకు కూడా సమాచారం చేరుతుంది. దీని కోసం ఏదైనా మీ ధ్రువీకరణ పత్రాన్ని యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. యాప్ టీమ్ దానిని పరిశీలించి మీకు వలంటీర్‌గా అవకాశం ఇస్తుంది. పోలీసులు చేరుకునేలోపు సమయం వృథా కాకుండా వెంటనే ఆపద నుంచి సదరు బాధితులను కాపాడవచ్చు.
నోట్: మీ ఫోన్‌లో జీపీఎస్ ఆన్‌లో ఉంటేనే ఈ సర్వీసులను మీరు పొందగలరు.
యాప్ డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి
Click here to Download the 112 App