How to Register Online for Corona Covid19 Vaccine @selfregistration.cowin.gov.in
Indian citizens who are of 18 years and above have to register Online for Corona Covid 19 Vaccine at the official website selfregistration.cowin.gov.in. Interested people need to follow these steps to book their slot for the Vaccine The registration process for those who are over 18 in the country to get the Covid-19 vaccine will start from the 28th of this month. Officials said on Thursday that the name could be registered through the online portal https://selfregistration.cowin.gov.in/ or the official App Aarogyasetu. It is known that the Central Government has recently announced that those who are above 18 years of age will be vaccinated from May 1st, 2021 as part of the third phase of the vaccination process. Necessary changes have been made in https://selfregistration.cowin.gov.in/, an official said.
As per the survey held up t now Vaccines are working Good. After the 2 doses of the vaccine they may be protected from severe corona attack and it is easily curable at home if it is attacked
How to Register Online for Corona ( Covid-19 ) Vaccine
Go to cowin portal (cowin.gov.in) and click on 'Register / Sign In Yourself'. Then enter the mobile number and you will get OTP. Enter it and click on the Verify button. Then the 'Registration of Vaccination' page opens. Enter the requested details (photo identity card, name, date of birth) and click on the register button. Once registered however the date for vaccination can be selected. Click on the Schedule button next to it
Steps to Register Online for Covid Vaccine Online
- Logon t the Official website https://selfregistration.cowin.gov.in/
- Click on Register Yourself
- Enter Your Mobile Number
- You will get an OTP to your given Mobil Number
- Enter the OTP and click on Verify
- You will be redirected to Registration Page
- Enter the requested details
- Click on Register Button
- After the Registration, Vaccination date can be selected
Click her to Register Online for Covid-19 Vaccine
*వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఎలా?* (మొబైల్ లేదా కంప్యూటర్ ముందు కూర్చొని.. కింది పేర్కొన్న అంశాలను ఫాలో అవ్వండి)
☀ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటే ముందుగా మన పేరు వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి.
☀ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం selfregistration.cowin.gov.in లింక్ అందుబాటులో ఉంచింది.
☀ ఈ లింక్‌ను మీరు స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ (ఇంటర్నెట్ ఉండాలి) ద్వారా ఓపెన్ చేయవచ్చు.
☀ బ్రౌజర్‌లో selfregistration.cowin.gov.in అని టైప్ చేస్తే చాలు రిజిస్ట్రేషన్ పేజ్ వస్తుంది.
☀ ‘రిజిస్టర్’ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, గెట్ ఓటీపీ (Get OTP) మీద క్లిక్ చేయండి.
☀ ఇప్పుడు మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ నెంబరును ఇచ్చి ‘వెరిఫై’ మీద క్లిక్ చేయండి.
☀ ఆ తర్వాత మరో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఏదైనా గుర్తింపు కార్డు నెంబరును ఎంటర్ చేయండి.
☀ ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, పింఛన్ పాస్‌బుక్, ఎన్పీఆర్ స్మార్ట్ కార్డ్, ఎంపీ, ఎంఎల్ఏ లేదా ఎంఎల్సి ఇచ్చిన గుర్తింపు కార్డు, వీటిలో ఏదైనా గుర్తింపు కార్డును ఉపయోగించవచ్చు.
☀ మీరు ఇచ్చిన ఐడీ కార్డు మీద ఉన్న పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలను ఎంటర్ చేసి ‘రిజిస్టర్’ మీద క్లిక్ చేయాలి.
☀ దీని తర్వాత వ్యాక్సిన్ ఎప్పుడు, ఎక్కడ తీసుకుంటారనే వివరాలను నమోదు చేయాలి.
☀ మీ వివరాలు నమోదైన తర్వాత కనిపించే ‘స్టేటస్’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
☀ ఈ సందర్భంగా మీకు అందులో ‘షెడ్యూల్ అపాయింట్మెంట్ ఫర్ వ్యాక్సినేషన్’ మీద క్లిక్ చేసి మీ రాష్ట్రం, జిల్లా తదితర వివరాలు ఇవ్వాలి.
☀ ఈ వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత ‘సెర్చ్’ మీద క్లిక్ చేస్తే.. మీ ప్రాంతానికి సమీపంలో గల వ్యాక్సినేషన్ కేంద్రాల జాబితా కనిపిస్తుంది.
☀ ఆ జాబితాలో మీకు దగ్గరగా ఉండే వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎంపిక చేసుకోండి.
☀ ఆ తర్వాత మీకు ఆ వ్యాక్సిన్ కేంద్రంలో మీకు అందుబాటులో ఉండే తేదీ, సమయాన్ని ఎంపిక చేసుకోండి. ఆ తర్వాత ‘కన్ఫర్మ్’ మీద క్లిక్ చేయండి.
☀ మీ వ్యాక్సిన్ నమోదు, అపాయింట్మెంట్ వివరాలన్నీ స్క్రీన్ మీద కనిపిస్తాయి. వీలైతే వాటిని స్క్రీన్ షాట్ తీసుకుని సేవ్ చేసుకోండి.
☀ ఒక్కసారి మీ ఫోన్ నెంబరుతో రిజిస్ట్రేషన్ పూర్తయితే మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. మీ ఫోన్ నెంబరుతో లాగిన్ కావచ్చు.
☀ మీ ఒక్క మొబైల్ ఫోన్ నెంబరుతో ఇంట్లో నలుగురు కుటుంబసభ్యులకు వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
☀ రిజిస్ట్రేషన్ సమయంలో కుటుంబ సభ్యుల వివరాలు ఇచ్చేందుకు Add More మీద క్లిక్ చేసి.. వారి పేరు, ఐడీ వివరాలు ఇవ్వండి.
☀ అపాయింట్మెంట్‌లో మీరు ఏ తేదీ, సమయాన్ని పేర్కొన్నారో ఆ సమయం కంటే ముందుగా వ్యాక్సినేషన్ సెంటర్‌కు చేరుకోవాలి.
☀ వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లినప్పుడు మీరు రిజిస్ట్రేషన్‌లో నమోదు చేసిన గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలి. మీ కుటుంబ సభ్యులు కూడా వారి ఐడీ కార్డులు తీసుకెళ్లాలి.
☀ ఈ ప్రక్రియపై మీకు ఏమైనా సందేహాలుంటే హెల్ప్ లైన్ నంబర్ 1075 కి ఫోన్ చేయండి. ఈ లింక్ మీద క్లిక్ చేసి వ్యాక్సిన్ కోసం మీ పేరు నమోదు చేసుకోండి. https://selfregistration.cowin.gov.in/
☀ ఆరోగ్య సేతు, ఉమాంగ్ యాప్ ద్వారా కూడా లాగిన్ కావచ్చు.
Citizens can Register for Vaccine through Aarogyasetu and Umang Android Apps also